శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తాను ప్రతిపక్షంలోనే ఉన్నానని.. అందుకే పీఏసీ చైర్మన్‌గా పదవి ఇచ్చారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. తాను కా్ంరగ్రెస్ కండువా కప్పుకోలేదని.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. ఆ సమయంలో సీఎం.. తనకు దేవాలయానికి సంబంధించిన కండువా కప్పారని స్పష్టం చేశారు. పీఏసీ చైర్మన్ పదవి దక్కడంపై అరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. పీఏసీ చైర్మన్ పదవి కోసం తనతోపాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన మరో ముగ్గురు కూడా నామినేషన్ వేశారని తెలిపారు. తనకు పీఏసీ పదవి రావడం పద్ధతి ప్రకారమే జరిగిందని అన్నారు. అయితే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు పీఏసీ పదవి రాకపోవడంతోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నా రని మండిపడ్డారు. తనపై హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అర్థరహితమని కొట్టిపారేశారు.