21-02-2025 01:08:24 AM
* మంత్రి కోమటిరెడ్డికి మతిభ్రమించింది
* బీఆర్‌ఎస్ నేత గండ్రా వెంకటరమణారెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకేసుకు మాజీమంత్రి హరీశ్‌రావుకు, నాకు ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హత్యారాజకీయాలను ప్రోత్సహించదని, కాంగ్రెస్ పార్టీకే ఆ అలవాటు ఉందని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో గురువా రం ఆయన మీడియాతో మాట్లాడా రు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని వి మర్శించారు.
రాజలింగమూర్తి హత్య ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ హత్యను బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్, హరీశ్‌రావుకు ఆపాదించాలని కాంగ్రె స్ శతవిధాలా యత్నించడం దుర్మార్గమని, స్థానికంగా భూవివాదంతోనే ఈ హత్య జరిగిందని చెప్పారు. కొందరి ఒత్తిడితోనే రాజలింగమూర్తి భార్య తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
ఈ హత్యపై సీబీఐ, సీఐడీ విచా రణను కాంగ్రెస్ నేతలు కోరుతున్నారని, ఎలాంటి విచారణ చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. మేడిగడ్డపై రాజలింగమూర్తి కోర్టులో కేసు వేశారని, దాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటున్నామని, కానీ.. మృతుడిపై భూ వివాదాల ఆరోపణలు ఉన్నాయన్నారు. రౌడీ షీట్ కూడా ఉందని వెల్లడించారు.