calender_icon.png 5 March, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ముగిసిన హరినామ సప్త కార్యక్రమం

04-03-2025 06:53:53 PM

పిట్లం (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద మాడ పోచయ్య మహారాజ్ ఆధ్వర్యంలో అఖండ హరినామ సప్త కార్యక్రమం ఏడు రోజులపాటు ఘనంగా నిర్వహించబడింది. వివిధ ప్రాంతాల నుండి మహారాజులు, గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు, భక్తులు పాల్గొని భజన కార్యక్రమం, ప్రవచనాలు ఆలకిస్తూ భగవంతుని నామస్మరణతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సప్త యొక్క ఆఖరి రోజు మంగళవారం ఊరేగింపు నిర్వహించి హనుమాన్ మందిరం వద్ద ఆధ్యాత్మిక చింతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు పటేల్, గ్రామ కమిటీ, భజన మండలి, కొండ్రవిటల్, మాజీ సర్పంచ్ అనసూయ, శంకర్ బైరి, లక్ష్మా గౌడ్, దుంపల సాయిలు, గొల్లారాజు మహేష్, కుమ్మరి హన్మాండ్లు, రేంజర్ల మైశయ్య, కుమ్మరి రమేష్, కుమ్మరి అంజయ్య, శంకర్ రేంజర్ల సాయిలు, గొల్లవిటల్ దొడ్లనర్శింలు, గ్రామ ప్రజలు, వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.