హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందనను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును ప్రభుత్వం ఉత్తర, దక్షిణ భాగాలుగా నిర్మిస్తుండ గా.. ఉత్తర భాగానికి ఇప్పటికే కేంద్రం నుంచి జాతీయ రహదారి హోదా లభించింది. దక్షిణ భాగం అలైన్మెంట్ను మార్చిన ప్రస్తుత ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ను రూపొందిస్తోంది. అలైన్మెంట్ మార్చితే నిధు లు ఇవ్వమని కేంద్రం చెప్పగా సొంత నిధులతో పనులు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది.