calender_icon.png 24 December, 2024 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్డ్‌విన్ ఇండియా బోనస్ ఇష్యూ

24-12-2024 01:09:53 AM

* రికార్డ్ తేదీ డిసెంబర్ 27

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయ క్రాంతి): ప్రముఖ  ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ సంస్థ హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ , గతంలో ప్రకటించిన 2:5 బోనస్ షేర్ల ఇష్యూకు సంబంధించి డిసెంబర్ 27ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించినట్లు వెల్లడించింది. అంటే, ప్రతి ఐదు ఈక్విటీ షేర్లకు 2 ఈక్విటీ షేర్లను బోనస్‌గా ఇస్తారు.అంతకుముందు, కంపెనీ భూటాన్‌లోని ది గ్యాల్సుంగ్ ఇన్ఫ్రా తో ఒక అవగాహన ఒప్పందం  కుదుర్చుకు న్నట్లు ప్రకటించింది.

ఈ ఒప్పందం ప్రకా రం, భవనాల పునరుద్ధరణ, భవిష్యత్ ప్రాజె క్టుల కోసం అవసరమైన ఆర్కిటెక్చరల్ హార్డ్ వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ ఉత్పత్తులను హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ సరఫరా చేస్తుంది. ఈ ఒప్పందం 2 సంవత్సరాల పాటు కొనసాగు తుంది. ఉత్పత్తుల విలువ సుమారు రూ.5 కోట్లుగా ఉంటుంది. ‘ఈ కొత్త విజయంపై మేము ఆనందిస్తున్నాము, ఇది మా వ్యాపా రం, వినియోగదారులు, మాకు సేవలంది స్తున్న సమాజాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుంది’ అని హార్డ్‌విన్ ఇండియా లిమి టెడ్ మేనేజింగ్ డైరెక్టర్  రుబల్జీత్ సింగ్ సాయల్ పేర్కొన్నారు.

57 సంవత్సరాల అద్భుతమైన వారసత్వంతో, హార్డ్‌విన్ ఆర్కి టెక్చరల్ హార్డ్‌వేర్ ప్రపంచంలో వినూత్నత, నాణ్యత, విశ్వసనీయతకు ప్రతీకగా నిలుస్తోంది. నివాస, వాణిజ్య నిర్మాణాల కోసం సమ గ్ర పరిష్కారాలను అందిస్తూ, సంస్థ నిరంతరంతన నాణ్యత ప్రమాణాలను మెరుగుప రుస్తోంది.