calender_icon.png 10 March, 2025 | 10:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూటాన్ గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో హార్డ్‌విన్ ఒప్పందం

11-12-2024 02:11:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి): దేశంలో ప్రముఖ ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ కంపెనీ హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ భూటాన్‌లోని గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం భూటాన్‌లో గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రా నిర్వహించే భవనాల పునరుద్ధరణ, రాబోయే ప్రాజెక్టులకు అవసర మైన ఆర్కిటెక్చరల్ హార్డ్‌వేర్, గ్లాస్ ఫిట్టింగ్స్ ఉత్పత్తులను హార్డ్‌విన్ ఇండియా లిమిటెడ్ అందించనుంది. ఈ ఒప్పందం ప్రకారం రెండేళ్ల వరకు దాదాపు రూ.5 కోట్ల విలువైన ఉత్పత్తుల సరఫరా కొనసాగుతుందని హార్డ్‌విన్ మేనేజింగ్ డైరెక్టర్ రుబల్జీత్ సింగ్ పాయల్ తెలిపారు.

‘ఈ ఒప్పందం మా కంపెనీకి, మా వినియోగదారులకు, మాకు అనుబంధమైన కమ్యూనిటీలకు ఉన్నతమైన గౌరవాన్ని అందిస్తుందన్నారు. భవిష్యత్తులో మా వ్యాపారం మరింత అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. 57 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యత, వినూత్నత, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి నివాస, వాణిజ్య ప్రాజెక్టుల సమగ్ర పరిష్కారాలను అందించే సంస్థగా పేరుగాంచించి నట్టు తెలియజేశారు. కస్టమర్ కేంద్రంగా ప్రపంచస్థాయి నాణ్యతను అందిస్తున్నామని తెలిపారు. భూటాన్‌కు చెందిన గ్యాల్సంగ్ ఇన్‌ఫ్రోతో ఒప్పందాన్ని గ్లోబల్ మార్కెట్ హోదాను బలపరుచుకోవడానికి శాశ్వత విజయంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.