calender_icon.png 13 February, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇటుకబట్టీల్లో వెట్టి చాకిరీ!

13-02-2025 12:52:48 AM

* కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోని నిర్వహకులు 

* సరైన వసతి విద్య వైద్య వసతి కల్పించాలి

* పని గంటలు పాటించాలి

* పనికి తగ్గట్లుగా వేతనాలు ఇవ్వాలి

నారాయణపేట, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి): నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు,మద్దూరు ధన్వాడ, మరికల్ మక్తల్ దామరగిద్ద  మండలాల్లో వందల సంఖ్యలో పుట్ట గొడుగుల్ల వెలిసిన అక్రమ ఇటుక బట్టి లపై సంబంధిత అధికారులు  అటు వైపు కన్నెత్తి చూడలేనట్లు  ఉంది. కార్మికుల సంక్షే మాన్ని ఇటుక బట్టిల నిర్వాహకులు పట్టించు కున్న దాఖలాలు లేదన్నట్లు ఉంది.

ఇటుక బట్టీల  నిర్వాహకులు ఒరిస్సా రాష్ట్రానికి సం బంధించిన కూలీలను తక్కువరేటుకు మా ట్లాడుకొని కొంత అడ్వాన్స్ నగదును బ్రోక ర్లు ద్వారా  చెల్లిస్తూ అక్కడి నుండి తీసుకొని ఇక్కడ బట్టీల్లో పనిచేయించుకొని లాభాలు ఆర్జిస్తూ కూలీల కడుపు కొడుతూ తమ వ్యా పారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుపుకొంటు లాభాలు ఆర్జిస్తున్నారు.

ముఖ్యంగా ఒకరాష్ర్టం నుండి ఇంకో రాష్ట్రానికి కార్మికుల ను తరలించాలంటే కార్మిక శాఖ నుండి అనుమతులుతీసుకోవాలి కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కార్మికుల ను తరలించివెట్టిచాకిరి చేయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదిలాఉండగా బట్టీల్లో పనిచె స్తున్న కార్మికులకు నివాసాలతో పాటు వారి వారి పిల్లలకు చదువు కోవటం కోసం ప్రత్యేకంగా వైద్యము ,విద్యా సదుపాయాలు కల్పించాల్సి ఉండగా అవేమి నిబంధనలు అమలుకు నోచుకోవడం లేదు ఇదే గాకుం డా వారికి ప్రతి రోజు 8 పనిగంటలు ఉండగా ఉదయం 5 గంటల సమయం నుండి సాయంత్రం 6,7 గంటల సమయం వరకు పనిచేయించుకొని సరైన వేతనాలు ఇవ్వకుండా వారి కడుపు కొడుతున్నట్లు తెలుస్తోంది.

వారి  బాగోగులు చూసే కార్మిక శాఖ అధికా రులు మాత్రం ఇటుకబట్టీల నిర్వాహకుల దగ్గర మామూళ్లు తీసుకొని  చోద్యం చూస్తు న్నారనీ పలువురు ఆరోపిస్తున్నారు. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు గతంలో ఇటుక బట్టీల్లో ఒరిస్సా రాష్ట్రానికి సంభదించిన కొంతమంది కార్మికులపిల్లలు ,కార్మికులు విద్యుత్తు ప్రమాదం లో,ట్రాక్టర్, జేసిబి క్రింద పడి దుర్మరణం చెందిన సందర్భం కూడా జరిగింది.

అలా ప్రమాదా నికి గురైన కార్మికులకు కూడా సరైన నష్ట పరిహారం ఇచ్చిన దాఖలాలు కూడ లేవని పలు కార్మికసంఘాల నాయకులు విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి ఇదిలాఉండగా కార్మికుల కుసరైన కూలి కూడా చెల్లించ కుండా, అలాగేవారి నిరక్షరాస్యత ఆసరాగా చేసు కొని కడుపు కొడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు కార్మికులు ఇంత మోసానికి గురౌతున్న సంభందిత శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా ఇటుకబట్టీలకు ఎర్రమట్టి, చెరువుల నుండి ఒండ్రుమట్టి తరలిస్తున్న రెవెన్యూశాఖ అధికారులు కూడా నోరు మెదపడం లేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

అసలు కార్మిక శాఖాధికారి అయితే ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళుతున్నారు అనేది ఎవరికీ తెలియదు.కార్మికుల విష యంలొ  ఇటుక బట్టీల నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నట్లు తెలుస్తోంది.దింట్లో భాగంగా నే అడవులనుంది  అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా కలపను ఇటుకబట్టిలకు తరలిస్తున్న అటవీ అధికారులు మాత్రం చో ద్యం చూస్తున్నారు.

బట్టీల నిర్వాహకుల సంఘము నాయకుల ద్వారా కొంతమంది అధికారులు కూడా విరాళాలు స్వీకరించడం కూడా కొంతమంది నిర్వాకులకు చర్యలు తీసుకోకుండా ఉండటం సంకేతాలు కనిపి స్తున్నాయి అలాగే ఏదైనా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే వ్యవసాయ భూమిని వ్యవసయేతర భూమిగా మార్చాల్సి ఉండాలి, విద్యుత్ శాఖాధికారులు ద్వారా అనుమతి పొందాలి కానీ కొన్ని ఇటుకబట్టీల నిర్వాహకులు మాత్రం వ్యవసాయ పంపు సెట్ల ద్వారానే నీళ్ళు మల్లిస్తున్నారు.

దీంట్లో భాగం గానే సదరు శాఖాధికారులకు ఓ ముఖ్యమైన శాఖాధికారికి లక్షా పదివేయిల రూపాయలు, ఇంకో అధికారికి యాభై వెయిల రూపాయలు, మిగతా సంభదిత శాఖాధికారులకు లక్షల్లో ముడుపులు ముట్టించినట్లు సర్వత్రా విమర్శలు సైతం ఉన్నాయి. పేరుకు మాత్రం విద్యుత్ బిల్లులు చెల్లిస్తూ సంభందిత విద్యుత్ లైన్ మెన్లకు నెల మామూళ్లు ఇస్తూ వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లుగా సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ఇకనైనా జిల్లాఉన్నతా ధికారులు ఇటుకబట్టీలపైచర్యలు తీసుకొని బట్టీల్లో పనిచేసే కార్మికుల కు,వారి పిల్లలకు న్యాయం జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు