31-03-2025 08:30:56 PM
బిచ్కుంద (విజయక్రాంతి): రాష్ట్ర వీరశైవ లింగాయత్, లింగ బలిజ సంగం రాష్ట్ర స్థాయిలో ఆర్విఎల్ఎల్బిఎస్ (RVLLBS) బసవ ప్రీమియర్ లీగ్ హార్డ్ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 సీజన్ అద్వర్యంలో ఏప్రిల్ 23 నుండి మే ఒకటి 2025 వరకు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ లు దినేష్ పాటిల్, శెట్టి శివకుమార్ లు సోమవారం తెలిపారు. రాష్ట్ర వీరశైవలి న్యాయ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ది పెవిలియన్ క్రికెట్ గ్రౌండ్, అజీజ్ నగర్, అప్ప జంక్షన్ దగ్గర, హైదరాబాద్ వేదికగా కొనసాగుతాయని వారు పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో, శ్రీ సద్గురు బండాయప్ప స్వామి ఎడ్యుకేషన్ సొసైటీ బిచ్కుందలో ప్రచారంలో బాగంగా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ క్రికెట్ ట్రోపిలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రూ.55,555, రెండవ బహుమతి రూ.22,222 లు అందజేయడం జరుగుతుందని తెలిపారు. చివరి తేదీ ఏప్రిల్ 02 వరకు ఎంట్రీ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శెట్టి శివకుమార్, దినేష్ పాటిల్, రాచప్ప, అనిల్ కుమార్, బీర్కూర్ బస్వరాజ్ పటేల్, అడ్వకేట్ దినేష్ పటేల్, సంతోష్ అప్ప, ప్రదీప్ పటేల్, హుండే బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.