* బీసీ సంక్షేమశాఖ జిల్లా డీడీ ఆశన్న
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 29 (విజయక్రాంతి): బీసీ సంక్షేమ శాఖ హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ హార్డ్ కాపీలను జనవరి 20లోగా తమ కార్యాలయంలో సమర్పించాలని ఆ శాఖ జిల్లా డీడీ ఆశన్న తెలిపారు. 2017 విద్యా సంవత్సరం నుంచి 2024 వరకు ఉన్న హార్డ్‌కాపీలను సమర్పించాలని ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు.
ఫీజుకు సంబంధించిన చాలా అప్లికేషన్లకు నోఫీజ్ అని ఈపాస్ సైట్‌లో చూపుతోందని, కాలేజీ యాజమాన్యాలు సంబంధిత పీఎంయూ సెంటర్‌ను సంప్రదించి ఫీ స్ట్రక్చర్‌ను అప్‌డేట్ చేయించుకోవాలన్నారు. ఫీజు స్ట్రక్చర్ అప్డేట్ కాకపోతే స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లకు పూర్తి బాధ్యత యాజమా న్యాలదేనని చెప్పారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.