calender_icon.png 24 December, 2024 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులపై వేధింపులను నివారించాలి

06-10-2024 12:51:38 AM

ఐఎన్‌టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమూద్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీలో కార్మికులపై వేధింపులు, పెరుగుతున్న పనిభారాన్ని నివారించాలని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ (ఐఎన్‌టీయూసీ) యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ మహమూద్ డిమాండ్ చేశారు.

నగరంలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో.. ఆర్టీసీలో 55 రోజుల సమ్మె సందర్భంగా అమరులైన 32 మంది కార్మికులకు టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆర్టీసీ అనేక ఆర్థిక ఇబ్బందులతో సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు.

ఈ సంక్షో భం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఆర్థికసాయం చేసి ఆదుకోవాలన్నారు. ఇప్పటికీ కొంతమంది కార్మికులకు బాండ్ డబ్బులు చెల్లింలేదని వెంటనే చెల్లించేలా ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాల న్నారు.  యూనియన్ నాయకులు రాజిరెడ్డి, అబ్రహాం, జక్కుల మల్లేశ్  పాల్గొన్నారు.