calender_icon.png 25 October, 2024 | 10:47 AM

పోలీసులను అడ్డుపెట్టుకొని మంత్రి వేధింపులు

12-07-2024 01:47:35 AM

మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి) :  కాంగ్రెస్ నాయకులు పో లీసులను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను వేధింపులకు గురి చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు. గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే 45 రోజులుగా పోలీసులు చర్యలు తీసుకో వడం లేదని మండిపడ్డారు. ప్రత్యర్థుల మీద రౌడీషీట్‌లు తెరవడానికి మంత్రి శ్రీధర్ బాబు తన సమయా న్ని వెచ్చిస్తున్నారని, పైకి సౌమ్యంగా కనిపించే శ్రీధర్ బాబు చాలా ప్రమాదకరమై వ్యక్తిని ఆరోపించారు. నాపై, నా కుటుంబ సభ్యులపై గతంలోనే రౌడీ షీట్ తెరిపించారని ఆరో పించారు.

మా కార్యకర్త సత్యనారాయణ ఇంటిని ఇటీవలే శ్రీధర్ బాబు అన్యాయంగా కూలగొట్టించారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యా దు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రతిప క్షంలో ఉన్నప్పుడు మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క చీటికి మంథని మా టికి వచ్చేవారని, ఇప్పడు మహిళలు అరణ్య రోదనలు చేస్తున్నా ఆయన ఇటు వైపు రావడం లేదని విమర్శిం చారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం ఉందా అని ప్రశ్నించారు. మహిళ కేసు విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని, లేదంటే  తాము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మంత్రి తమ్ముడి అరాచకాలను తక్షణమే ఆ పాలని, బడుగు బలహీన వర్గాలపై ఆయన చేస్తున్న దౌర్జన్యంపై డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలని కోరారు.