calender_icon.png 9 January, 2025 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుల్లితెర నటికి వేధింపులు

03-01-2025 01:05:56 AM

నిందితుడి అరెస్టు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2(విజయ క్రాంతి): ప్రేమ, పెళ్లి పేరుతో ఓ బుల్లితెర నటిని వేధింపులకు గురిచేస్తున్న యు వకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరె స్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ నగరంలోని యూసుఫ్‌గూడ ప్రాంతంలో తన పిల్లలతో కలి సి నివసిస్తోంది.

ఓ సీరియల్ కోసం పనిచేస్తున్న సందర్భం లో గతేడాది సెప్టెంబర్‌లో బత్తుల ఫణితేజ అనే వ్యక్తితో ఆమెకు పరిచ యం ఏర్పడింది. ఆ పరిచయం స్నే హంగా మారింది. ఈ క్రమంలో ఆమెను వివాహం చేసుకుంటానని ఫణితేజ ఆమెకు చెప్పాడు. అయితే తనకు పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని.. పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటున్న విషయాన్ని చెప్పి.. ఫణితేజ ప్రపోజల్‌ను తిరస్కరించింది.

అప్పటినుంచి ఫణితేజ.. ఆమెకు వాట్సప్‌లో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడు. సదరు యుతి అత్త దగ్గరకు వెళ్లి ఆమె గురిం చి చెడుగా చెప్పాడు. దీంతో ఆయు వతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో గురువారం పోలీసులు ఫణితేజను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.