calender_icon.png 29 November, 2024 | 6:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేయని నేరానికి పరిహారం కోసం వేధింపులు

18-05-2024 02:18:03 AM

భయపడి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్

కామారెడ్డి జిల్లాలో తీవ్ర కలకలం

కామారెడ్డి, మే 17 (విజయక్రాంతి): చేయని నేరానికి పరిహారం ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో భయపడి ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గోండకు చెందిన చాకలి సిద్దిరాములు (35) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 12న ఆర్గోండ శివారులో అర్ధరాత్రి బహిర్బూమికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన కుమ్మరి సత్తవ్వను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. తెల్లవారున మహిళా మృతికి చాకలి సిద్దిరాములు కారణమని గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు అనుమానం వ్యక్తం చేశారు.

మృతురాలి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వేధింపులకు పాల్పడ్డారు. ౪ రోజులుగా మనోవేదన చెందిన సిద్దిరాములు.. గురువారం రాత్రి సమీపంలోని ఎల్లారెడ్డిపల్లి శివారులో అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని కొందరు వేధించడంతోనే  తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య శ్యామల.. రాజంపేట పోలీసులకు పిర్యాదు చేశారు. రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టినట్లు తెలిపారు.