calender_icon.png 13 January, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృషిభవన్ నిర్వాహకుల వేధింపులు

05-01-2025 12:00:00 AM

కరీంనగర్ సిటీ, జనవరి 4 (విజయ క్రాంతి) : కక్షపూరితంగా షట్టర్లలో ఉన్న కిరాయి దారులను కృషి భవన్ నిర్వాహ దారులు ఆటంకం కలిగిస్తూ, వేధింపులకు గురి చేస్తున్న  వారిపై చర్యలు తీసుకోవాలనీ సిపిఐ నగర కార్యదర్శి కాసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. కలెక్టరెట్ రోడ్డుకు అను కొని  ఉన్న కృషిభవన్ కిరాయిదారుల షట్ట ర్లను శనివారం సందర్శించారు.

షట్టర్ లను, నీళ్లతో నిండిన రూములను, నీళ్లు పడి చెడిపోయిన కంప్యూటర్లను, ఫర్నిచర్లను పరి శీలించారు. కిరాయి దారులతో వివరాలు తీసుకొని వారు మాట్లాడుతూ మానవ విలువలు పూర్తిగా మంటగలిసే విధంగా షట్టర్‌పై కప్పుకు రంధ్రం చేసి అందులో నుండి నీళ్లు వదిలిపెట్టి ఆఫీసులోని సామా గ్రి విలువైన పేపర్స్ డాక్యుమెంట్ను పూర్తిగా నీటి మయం చేయడం దుర్మార్గమైన చర్యని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఒక షెటర్లో పొల్యూషన్ సెంటర్, మరో షటర్‌లో ఆటో కన్సల్టెన్సీ  కార్యాల యం ఉందని వీరు ఉపాధి లేక స్వయం ఉపాధితో పనిచేసుకుంటూ జీవనం గడుపు తున్నారని వీరి పనులకు ఆటకం కలగజే స్తూ, ఒత్తిడీలు, భయభ్రాంతులకు కలుగజే స్తూ మానవత్వన్ని పూర్తిగా మరిచిపోయి నిర్ధాక్షణంగా ప్రవర్తిస్తున్న కృషి భవన్ నిర్వహణదారులపై  జిల్లా కలెక్టర్  స్పందిం చి వెంటనే చర్యలు తీసుకోవాలని, కనబ డకుండా మూసివేసే కుట్రలు చేయడం దారుణమన్నారు.

గతంలో కిరాయిదారులు పలుమార్లు కలెక్టర్‌కి విన్నవించిన పట్టిం చుకోకపోవడం కరెక్ట్ కాదన్నారు. ప్రభుత్వం స్థలము ఇచ్చి భవనానికి నిధులు కేటాయిం చి నిర్మిస్తే కొందరు వ్యవసాయ శాఖ  రిటైర్ ఉద్యోగ సంఘం నాయకులు  తమదే నడవాలని  పెత్తనం చేస్తూ భయభ్రాంతు లకు గురిచేయడం ఏంటని వారు ప్రశ్నిం చారు.

వెంటనే జిల్లా అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించి నిరుద్యోగుల జీవితాలను కాపాడాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమా లకు పిలుపునిస్తామని  హెచ్చరించారు.