calender_icon.png 22 December, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలను వేధిస్తే జైలుకే

12-09-2024 12:50:34 AM

  1. శిక్షలను కఠినతరం చేసిన షీ టీమ్స్
  2. గతేడాదితో పోల్చితే పెరిగిన ఫిర్యాదుల సంఖ్య 
  3. అవగాహన కార్యక్రమాలతో మహిళలకు భరోసా

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): మహిళల జోలికొస్తే జైలుకు పంపిస్తామని హెచ్చరిస్తున్నారు షీ టీమ్స్ అధికారులు. ఇటీవల కాలంలో మహిళలు, యువతులు, చిన్నారులపై వేధింపులు ఎక్కువయ్యాయి. చీకటి పడితే చాలు.. అత్యవసర పనులపై కూడా మహిళలు ఒంటరిగా బయటకి వెళ్లలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మహిళలకు మేమున్నామని భరోసా కల్పిస్తుంది షీ టీమ్స్.

కామాంధులు, ఆకతాయిల ఆటకట్టించేందుకు షీ టీమ్ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు షీ టీమ్, ఉమెన్ సేఫ్టీ వింగ్, భరోసా కేంద్రాలు సాంకేతిక పరిజ్ఞానంతో నిరంతరం నిఘా సారించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. నేరాలను అరికట్టడానికి శిక్షలను కఠిన తరం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ కోసం గ్రేటర్ హైద రాబాద్ వ్యాప్తంగా వినూ త్న కార్యక్రమాలు నిర్వహిస్తూ భరో సా ఇవ్వడంతో పాటు మహిళల భద్రత కోసం పనిచేసే షీ టీమ్ బృందాలను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టామని నగర మహిళా భద్రత విభాగం డీసీపీ ధార కవిత పేర్కొన్నారు.

గతేడాది షీటీమ్స్ అధికారులకు 1,268 ఫిర్యాదులు అందగా, ఈ ఏడాది ఆగస్టు 31 వరకు 832 ఫిర్యాదులందాయి. 2023లో మాఫ్టీలో 978 మందిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకోగా, ఈ సంవత్సరం ఆగస్టు 31 నాటికి 1,264 మందిని అదుపులో తీసుకున్నారు.

ఫిర్యాదు చేయండిలా..

మహిళలను వేధించే ఆకతాయిలపై నూతన చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నారు. బాధితులు డయల్ 100, వా ట్సాప్ 9490616555, హాక్ ఐ, ఈమెయిల్, సోషల్ మీడియా, క్యూఆర్ కోడ్స్ ద్వారా చేసే ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, సినిమా హాళ్ల వద్ద ఇప్పటికే క్యూఆర్ కోడ్‌తో కూడిన షీ టీమ్స్ పోస్టర్లను అతికించారు. బాధితులు క్యూ ఆర్‌ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని షీ టీమ్స్ బృందా లు అవగాహన కల్పిస్తున్నా యి. యాంటీ హ్యూ మన్ ట్రా ఫికింగ్ ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల అక్రమ రవాణా ను మరింతగా కట్టడి చేసేలా చర్యలు చేపడుతున్నారు. 

అవగాహన కార్యక్రమాలు..

స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, బస్టాప్, బహిరంగ ప్రదేశాల్లో షీ టీమ్ బృందాల ద్వారా ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు పోకిరీలపై చిన్న చిన్న కేసులు నమోదు చేస్తూనే, ఇలాంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో జరిగే పరిణామాలపై హెచ్చరిస్తున్నారు. గృహహింస బాధితులకు ధైర్య యాప్ ద్వా రా షీ టీమ్ బృందాలు రక్షణ కల్పిస్తున్నాయి.

ముఖ్యంగా హైస్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నేరాల నివారణకు శిక్ష ణ ఇవ్వడంతో పాటు షార్ట్‌ఫిల్మ్‌లు, యా డ్స్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం వంటి సామాజిక మాధ్యమాల ద్వారా భద్రతా చర్యలను వివరిస్తున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా మారువేష్లాలో నిఘా సారిస్తున్నారు. మా ల్స్,  సినిమా థియేటర్స్, బస్టాప్‌లు, మహి ళా కాలేజీల వద్ద షీ టీమ్స్ సిబ్బం ది మాఫ్టీ లో ఉంటూ రహస్య కెమెరాలతో నిఘా పెడుతున్నారు. 

సాంకేతిక పరిజ్ఞానంతో.. 

ఇటీవల కాలంలో మహిళలపై పెరుగుతున్న నేరాల పట్ల షీ టీమ్స్ బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తున్నాయి. ఉద్యోగం చేసే మహిళలను పైస్థా యి అధికారులు ఇబ్బంది పెట్టడం, విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి వాటిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఫిర్యాదులు అందిన వెంటనే ఆకతాయిలను వెంటనే అరెస్ట్ చేస్తున్నామని పేర్కొన్నారు. 

మహిళల భద్రతే ప్రథమ కర్తవ్యం 

మహిళల భద్రతే షీ టీమ్స్ బృందాల ప్రథమ కర్తవ్యం. ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల నుంచి వారిని రక్షించడంతో పాటు వారిలో ఆత్మస్థుర్యైన్ని పెంపొందిస్తున్నాం. ఇంట, బయట మహిళలు వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలి. షీ టీమ్స్ బృందాల పనితీరుపై బహిరంగ ప్రదేశాలు, స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదు అందిన వెంటనే నిందితుల ఆటకట్టించడంతో పాటు సంబంధిత మహిళ వివరాలను గోప్యంగా ఉంచుతాం.

డీసీపీ ధార కవిత (మహిళా భద్రత విభాగం)