calender_icon.png 27 February, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర.. హర.. శంకర

27-02-2025 02:38:07 AM

  1. ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
  2. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

హైదారబాద్, ఫిబ్రవరి 26: మహాశివరాత్రిని పురస్కరించుకొని బుధవారం రాష్ట్రం లోని శైవక్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వర ముక్తేశ్వర ఆల యం, వెయ్యి స్తంభాల గుడి, రామప్ప, కొమురవెల్లి మల్లన్న, కీసర రామలింగేశ్వర ఆలయాలకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. తెలంగాణలోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగాయి.

స్వామివారిని దర్శించు కొనేందుకు వేకువజామున నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. ప్రధాన ఆలయా ల్లో భక్తుల కోసం ఆయా దేవస్థానాల కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో రాజరాజేశ్వరుడిని దర్శించుకునేం దుకు ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తులు కోడెమొక్కులు చెల్లించుకు న్నారు.

రాజన్న దర్శనానికి ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు. వేములవాడలో మూడురోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. కీసరగుట్టలోని రామలింగేశ్వరాలయంలోనూ భక్తు లు ఉదయం నుంచి పోటెత్తారు. నగరం నలుమూలల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. జాగరణ, శివకల్యాణం కార్యక్రమాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

శివోహం..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం బుధవారం శివనామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, పట్టణమంతా కిటకిటలాడింది. అర్ధరాత్రి సమయంలో 11 మంది రుత్వికులతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కన్నుల పండువగా జరిపించారు. 41 రోజులు శివ దీక్షలు తీసుకున్న స్వాములు భీమేశ్వరాలయంలో మాల విరమణ చేశారు.