calender_icon.png 27 February, 2025 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర హర మహాదేవ.. శంభో శంకర

27-02-2025 01:26:45 AM

  1. ఘనంగా శివరాత్రి వేడుకలు 
  2. రాజన్న సన్నిధిలో 2లక్షలకు పైగా భక్తులు  

వేములవాడ, ఫిబ్రవరి 26: వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయం బుధవారం శివనామస్మరణతో మార్మోగింది. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తజనంతో పోటెత్తింది. దాదాపు రెండు లక్షలకు పైగా భక్తులు స్వామి వారిని దర్శించుకోగా, వేములవాడ పట్టణం కిటకి టలాడింది. అలాగే అద్దాల మండపంలో  అనువంశిక అర్చకులు దాదాపు 2.30 గంటలపాటు మహా లింగార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఉదయం 5 నుంచి 8గంటల వరకు స్వామి వారికి ప్రాతఃకాలపూజ, మహాన్యాసపూర్వక ఏకా దశ రుద్రాభిషేకం నిర్వ హించారు. భక్తుల రద్దీదృష్ట్యా గర్భగుడిలో అర్జిత సేవలను రద్దు చేశారు. రాత్రి 11.30 గంటలకు ఆలయ గర్భగుడి ఎదుట లింగోద్భవకాలంలో 11 మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని కనులపండువగా జరిపించారు.

 రాజన్నను దర్శించుకున్న ప్రముఖులు 

వేములవాడ శ్రీ రాజన్నను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకురాలు కలవకుంట్ల కవిత,  బీఆర్‌ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దర్శించుకోగా, వారికి అర్చ కులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ఈవో వినోద్ రెడ్డి స్వామివారి  వారి ప్రసాదం అందించారు.

దీక్ష విరమించిన శివస్వాములు 

దాదాపు మూడు వేలకు పైగా శివస్వాములు 41 రోజులుగా భక్తిశ్రద్ధలతో శివదీక్షలు చేపట్టారు. వెంట తెచ్చుకున్న ఇరుముడులను రాజన్న ఆలయంలో చెల్లించి, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రాజన్న అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వరాల యంలో దీక్ష విరమణ చేశారు.

దుబ్బ రాజన్న సన్నిధిలో.. 

జగిత్యాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): మాఘ బహుళ త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం ‘మహాశివరాత్రి’ వేడుకలు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వైభవంగా జరిగాయి. ఉదయం సూర్యోదయానికి ముందు నుండే శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

జగిత్యాల నియోజకవర్గం సారంగాపూర్ మండలం పెంబట్లలోని ప్రము ఖ పుణ్యక్షేత్రం ‘దుబ్బ రాజన్న’ దేవాలయం, జగిత్యాల మండలం పొలాసలోని ప్రాచీనాలయం శ్రీ పౌలస్థేశ్వరస్వామి దేవాలయంతో పాటూ వేములవాడ నియోజకవర్గంలోని లొంక రామేశ్వరాలయం, కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రాచీనాలయం శ్రీమహా దేవస్వామి దేవాలయంలో  సకృతావర్తన రుద్రాభిషేక పూజలు వేద మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా జరిపించారు.

అలాగే రాయికల్ గుడికోట శివాలయం, జగిత్యాల  గుట్ట రాజరాజేశ్వరస్వామి దేవాలయం, కోరుట్ల నగరే శ్వర దేవాలయం, మార్కండేయ దేవాలయం లో భక్తులు ఉదయం నుండే దర్శనం, అభిషేకాల కోసం బారులు తీరారు. కాగా దుబ్బ రాజన్న దేవాలయంలో శివరాత్రి మొదలుకొని 4 రోజుల పాటూ బ్రహ్మోత్సవాలు జరు గనున్నాయి.

ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల నుండి భక్తులు వేల సంఖ్యలో తరలి రానున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవా రం ఉదయం నుండే భక్తులు అధిక సంఖ్య లో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.

శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 24న అంకురార్పణతో ప్రారంభం కాగా, మంగళవారం రాత్రి స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణోత్సవంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు పాల్గొని విశేషపూజ నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని దు బ్బ రాజన్న ఆలయంలో స్వామివారికి అర్చకులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహిం చారు.

ఎమ్మెల్సీ జీవన్’రెడ్డి దంపతులు పాల్గొ ని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్’లో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశించారు. భక్తుల సౌకర్యం కోసం  తాగునీరు, టెంట్లు, చలవ పందిల్లు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల నుంచి ప్రతి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సలు నడుపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ కంట్రోల్ రూమ్, ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. నేడు మహాశివరాత్రి జాగరణ రాత్రి 12 గంటలకు లింగోద్భవ, రుద్రాభిషేకం, నిశి పూజ నిర్వహించనున్నారు. మొత్తం మీద బుధవారం మహాశివరాత్రి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి.

మాజీ మేయర్ ప్రత్యేక పూజలు

కరీంనగర్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నగరంలోని  అయ్యప్ప స్వామి దేవాలయం లో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంను మాజీ మేయర్ సునీల్ రావు దంప తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

శ్రీ మృత్యుంజాలయంలో

తిమ్మాపూర్, ఫిబ్రవరి 26: మహాశివరాత్రి సందర్భంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల శ్రీ గిరిజ మృత్యుంజయ మహాదేవాలయంలో భక్తులతో బుధవారం కిక్కిరిసింది.  ఆలయ అర్చకులు పురుషోత్తం మిశ్రా పవన్ లతోపాటు పలువురు అర్చకుల వేదమంత్రాల మధ్య ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ,లు ఆలయ గర్భగుడిలో పూజలు నిర్వహించగా ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు చల్ల మో హన్ రెడ్డి, సంగం లక్ష్మణరావు,లు  ఆయనకు ఘనంగా సన్మానం చేసి ప్రసాదాన్ని వితరణ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మా ట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట ప్రజలు సుఖ సం తోషాలతో పాడిపంటలు సమృద్ధిగా పండి సకజనులు చల్లగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గిరిజా గోశాల నిర్మాణ కర్త లు డా డా.రమణాచారి దంపతులు ఆలయ కమిటీ సభ్యులు బాలకిషన్ రావు, గంగారపు రమేష్, కర్ణాకర్, వెంకటాచారి, లతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

పెద్దపల్లిజిల్లాలో 

పెద్దపల్లి, మంథని, రామగుండం, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): మహాశివరాత్రి పురస్కరించుకొని బుధవారం పెద్దపల్లి జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పండుగకు జిల్లాలో  శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖ శివ క్షేత్రాలైన  ఆలయంలో శివ కళ్యాణం నిర్వహించగా భక్తు లు తండోపతండాలుగా తరలి వెళ్లారు. రామగుండం లోని గోదావరి నది లో పుణ్యస్నానా లు ఆచరించారు.

అనంతరం జనగామ శివ ఆలయంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే మక్కన్ సింగ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకుడు  అర్చన చేశారు. మంథని పట్టణంలోని గౌతమేశ్వరాలయంలోని గోదావరి నదిలో గోదావరి స్నా నం పుణ్య స్నానాలు చేసే  శివున్ని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంథ నిలో గోదావరి స్నానం చేసేందుకు వస్తున్న భక్తులకు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అల్పాహారం ఏర్పాటు చేయగా మంత్రి సోదరుడు దుదిళ్ల శ్రీనుబాబు పాల్గొని భక్తులకు అల్పాహారం అందించారు.