27-02-2025 01:06:03 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన ఇచ్చోడ మండలం సిరిచెల్మ లోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, బేల మండ లం బాది లోని శ్రీ నందీశ్వరాలయం, సదల్పూర్ లోని బైరందేవ్ మహాదేవ్ ఆలయం, జైనథ్ మండలం కొరాటలోని పెన్ గంగ నది ఒడ్డున ఉన్న శ్రీ ఓంకారేశ్వర్ ఆలయం, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని కోటిలింగాల శైవ క్షేత్రం తో పాటు జిల్లా కేంద్రంలోని పలు శైవ క్షేత్రాల్లో బుధవారం తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. మరోవైపు సిరిచెల్మ లోని ప్రసిద్ధిగాంచిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గర్భగుడిలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు జైనథ్ మండలంలోని తన స్వగ్రామమైన అడ గ్రామంలోని శివాలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. స్వయంగా పల్లకిని మోస్తూ పల్లకి సేవలో పాల్గొన్నారు.
జిల్లాలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు
నిర్మల్ ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి) ః నిర్మల్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు పులుసుకుని శివాలయాలు బుధవారం భక్తులతో కిటకిట లాడాయి. శివ శివ శంభో హర హర శంభో మహాదేవ అంటూ భక్తులు శివునికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. జిల్లాలోని కదిలి బ్రహ్మేశ్వరాలయం టెంపుల్ బూరుగుపల్లి రాజేశ్వర సిద్దేశ్వర చీరాల గుడిసెరాల రాజరాజేశ్వర స్వామి సూర్యాపూర్ రాజేషుడు పూల మా లింగేశ్వరుడు పట్టణంలోని వెయ్యి లింగాల గుడి ఓంకారేశ్వరాలయం బాసర శివాలయం తదితర ఆలయాలు భక్తులతో సందడిగా కనిపించాయి.
కదిలి ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల అటవీ శాఖ కన్జర్వేటర్ శర్వానంద్ మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తదితర ప్రముఖులు ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో భజన సంకీర్తనలు అన్నదానాలు నిర్వహించగా టీజీ ఆర్టీసీ ద్వారా వివిధ ఆలయాలకు ప్రత్యేక బస్సులను నడిపించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివాలయాలు ఉదయం నుండే భక్తులతో కిటకిటలాడాయి. పలుచోట్ల శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా చేపట్టారు. వాంకిడి మండల కేంద్రంలోని శివకేశవ ఆలయంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ,
మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు ,నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్,ప్రత్యేక పూజలు చేశారు అనంతరం జిల్లా కేంద్రంలో ని సందీప్ నగర్ శివాలయంలో జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. హిందు వాహిని ఆధ్వర్యంలో పనులు పంపిణీ చేశారు. శ్రీ బాలేశ్వర ఆలయంలో టెలి సిని దర్శకనిర్మాత నాగ బాల సురేష్, జిల్లా రవాణా శాఖ అధికారి రామచంద్రనాయక్ ప్రత్యేక పూజలు చేశారు.ఆసిఫాబాద్ మండలం చిర్రకుంట శివాలయంలో బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు మాజీ ఎంపీపీ మల్లికార్జున యాదవ్ ప్రత్యేక పూజలు చేపట్టారు.
బూరుగుడా గ్రామంలోని శివపంచాయతన ఆలయంలో పేద పండితుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం చేపట్టారు. రెబ్బెన మండలం నంబాల గ్రామంలోని శివాలయం వద్ద అత్యంత వైభవంగా రథోత్సవాన్ని చేపట్టారు. కాగజ్ నగర్ మండలం ఇస్గాం శివ మల్లన్న ఆలయంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్,
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చా ర్జ్ రవి శ్రీనివాస్, జెడ్పి మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేపట్టారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పండ్లు, మజ్జిగను పంపిణీ చేశారు.జిల్లా వ్యాప్తంగా నెలకొన్న శివ క్షేత్రాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు తీర్చుకున్నారు.
కిటకిట లాడిన శైవ క్షేత్రాలు పెద్ద ఎత్తున దర్శించుకున్న భక్తులు
మంచిర్యాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి) : జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు బుధ వారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దంపతులు మంచిర్యాల సమీప గోదావరి తీరాన గల శివాలయంలో, చెన్నూర్ ఎంఎల్‌ఏ గడ్డం వివేక్ వెంకటస్వామి, సరోజ దంపతులు జైపూర్ మండలంలోని వెలాల గట్టు మల్లన్న స్వామిని, బెల్లంపల్లి ఎంఎల్‌ఏ గడ్డం వినోద్ వెంకట స్వామి, రమ దంపతులు బుగ్గ రాజ రాజేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని శివాలయాలతో పాటు ప్రముఖ ఆలయాలు భక్తులతో క్రిక్కిరిసిపోయాయి. భక్తులు ఉదయమే సమీప గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు ఎన్నో ఏళ్లుగా పూజలందుకున్న పాప హరేశ్వరుడు
బాసర, ఫిబ్రవరి 26 ః శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలా డుతున్నాయి జిల్లాలోని లోకేశ్వరం మండలంలోని బ్రహ్మేశ్వర శివాలయం ముధోల్ మండలంలో పశుపతినాథ్ బాసర మండల కేంద్రంలో అతి పురాతనమైన పాప హరేశ్వర శివాలయం ఈసారి భక్తులతో మార్మోగింది శైవ క్షేత్రాలు భక్తులతో శివనామస్మరణతో మార్మోగాయి ఉదయమే భక్తులు గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి గోదావరి నది ఒడ్డునఉన్న సూరేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పూజలు నిర్వహించి బాసర దత్తాత్రేయ స్వామి ఆలయ సమీపంలో ఉన్న పాపశ్వర స్వామి ఈసారి గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.
వేద పండితులు పాపారేశ్వర స్వామికి మహా రుద్ర బిల్వ ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సౌకర్యాలు ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు పాప హరేశ్వర స్వామికి దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలైన కీర్గుల్, కౌటా, సలాపూర్ తదితర గ్రామాల ప్రజలు పాప హరేశ్వర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు చెల్లించుకున్నారు ఉపవాస దీక్షలతో మొదలైన మహాశివరాత్రి గురువారం సాయంత్రం ఒక్కపొద్దులు అన్నవితరణ చేసి మహాశివరాత్రి పర్వదినాన్ని ముగిస్తారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.