హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): వినాయక చవితి పర్వదినం సంద ర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలి పారు. వాడవాడలా వెలిసే గణేశ్ మండపా లలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని తెలిపారు. ఈ నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం అప్రమత్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధి కారులను ఆయన ఆదేశించారు. ఈ ఏడాది వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు.
కిషన్‌రెడ్డి శుభాకాంక్షలు
సకల గణాలకు అధిపతి, తొలిపూజలు అందుకునే పార్వతీ తనయుడి జన్మదినమైన వినాయకచవితి సందర్భంగా హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియచే స్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గణనాథుడి ఆశీర్వాదంతో అన్ని విజ్ఞాలు తొలగిపోవాలని, అనుకున్న కార్యాలన్నీ విజ యవంతంగా పూర్తి చేసే శక్తిని ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. వినాయక మండపా ల వద్ద కనీస జాగ్రత్తలు పాటిస్తూ భక్తిశ్ర ద్ధలతో పండుగ జరుపుకునాలని కోరారు. వినాయకచవితి ప్రశాంతంగా కొనసాగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.