29-03-2025 11:38:37 PM
జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు..
సంగారెడ్డి (విజయక్రాంతి): జిల్లా ప్రజలకు విశ్వవసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉగాది జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో వెలుగు తేవాలన్నారు. ఉగాది పచ్చడి మాదిరి జీవితంలో చేదు, వగరు, తీయదానం కలగలిపి ఉంటుందన్నారు. ఈ విశ్వ వసు నామ సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని అన్ని వర్గాల ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకాంక్షించారు.