calender_icon.png 1 April, 2025 | 8:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

29-03-2025 09:50:27 PM

 ప్రముఖ సంఘ సేవకులు అయిత పరంజ్యోతి

చేగుంట,(విజయక్రాంతి): తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం (శ్రీ విశ్వావసు నామ సంవత్సరం) సందర్భంగా ప్రముఖ సంఘాసేవకులు, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి చేగుంట పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరికీ శుభమే జరగాలని ఆకాంక్షించారు. ఈ పండుగను ఆనందంగాను, ఉత్సాహంగా జరుపుకోవాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతోను, అష్టైశ్వర్యాలతోను తులతూగాలని అభిలాషించారు.