calender_icon.png 1 April, 2025 | 9:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

29-03-2025 11:37:07 PM

రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ..

సంగారెడ్డి (విజయక్రాంతి): తెలుగు ప్రజలందరికీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ విశ్వావసు నామా సంవత్సరలో ప్రజలందరూ దయ, కరుణ, పరస్పర శ్రేయస్సును కలిగి ఉండాలన్నారు. అలాగే, ప్రజలందరూ  ఆయురారోగ్యాలతో, సామాజికంగా, ఆర్థికంగా, శాంతి సౌభాగ్యాలతో, సమృద్ధి వర్షాలతో, పాడి పంటలతో ప్రజలందరికీ శుభం కలిగి అందరి జీవితాలలో ఆనందం విరిజిల్లాలని రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ భగవంతున్ని కోరుకున్నారు. ఉగాది పండుగ మన అందరి జీవితాలలో ఆనందాన్ని, శాంతిని కలగజేయాలని, ఈ విశ్వావసు నామ సందర్భంగా (ఉగాది) శుభాకాంక్షలు తెలియజేశారు .