calender_icon.png 21 February, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి

19-02-2025 08:08:02 PM

బూర్గంపాడు (విజయక్రాంతి): మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి గ్రామంలోని యువకులందరూ కలసి ఘనంగా నిర్వహించారు. హనుమాన్ సెంటర్ లో 17వ తేదీన శివాజీ మహారాజ్ విగ్రహా ఆవిష్కరణ చేశారు. శివాజీ జయంతి రోజున గ్రామంలోని యువకులంరూ కలసి హనుమంతుని విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి మహనీయడు ఈ జాతికి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ దేశంలోని వేల దేవాలయాలను మొఘల్ చక్రవర్తుల భారి నుండి కాపాడారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఏం చేసినా శివాజీ మహారాజ్ ఋణం ఈ జాతి తీర్చుకోలేదని కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి జైశ్రీరామ్ నినాదాలతో శోభాయాత్ర చేశారు.