calender_icon.png 13 January, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

13-01-2025 02:34:09 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాం తి): తెలంగాణతో పాటు తెలుగు ప్రజలందరికీ సీఎం రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాం క్షలు తెలిపారు. భోగభాగ్యాలు తెచ్చే భోగి, కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించా రు. రాష్ట్రంలోని కోటి మంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఈ పండుగ కొత్త వెలుగులు తెస్తుందన్నారు.

కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ రైతు భరోసా, రైతు భరోసా పథకాలకు సంక్రాంతి నాంది పలుకుతోంద ని పేర్కొన్నారు. అర్హులైన అందిరికీ సంక్షేమ పథకాలు చేరాలన్నదనే తన సంకల్పమన్నా రు. వ్యవసాయంతో పారిశ్రామిక, ఉపాధి రంగాల్లో రాష్ట్రం పురోగమిస్తుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.