calender_icon.png 15 January, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు

15-01-2025 06:18:53 PM

ఐఎన్ టిసి జనరల్ సెక్రెటరీ జనక్ ప్రసాద్...

పెద్దపల్లి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఈ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవాలని కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు  తెలుపుతున్నట్లు గోదావరిఖనిలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ జనరల్ సెక్రెటరీ, రాష్ట్ర కనీస వేతనాల శాఖ చైర్మన్ జనక్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జనక్ ప్రసాద్ మాట్లాడుతూ... సింగరేణి వ్యాప్తంగా కార్మిక కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు కార్మికులకు ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ ప్రజా పాలన ప్రజల కోసమే పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka)కు, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు స్థానిక ఎమ్మెల్యేకు ప్రజల పక్షాన జన ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి, కొంపెల్లి సమ్మయ్య, నరసింహ రెడ్డి, వడ్డేపల్లి దాస్, వికాస్ కుమార్, సదానందం, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.