calender_icon.png 26 November, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

10-10-2024 01:24:35 AM

  1. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ 
  2. పూలను పూజించే గొప్ప సంస్కృతి: సీఎం రేవంత్

హైదరాబాద్, అక్టోబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అక్కాచెల్లెళ్లందరి కీ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయానికి బతుకమ్మ ప్రతీక అని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పేద, ధనిక, చిన్న, పెద్ద తేడా లేకుండా మహిళలందరూ ఒకేచోట ఆడిపాడే తొమ్మిది రోజుల పండుగ బతుకమ్మ అని ఆయన కొనియాడారు.

ఈసారి బతుకమ్మను అంద రూ ఆనందంగా జరుపుకోవాలన్నా రు. పూలను పూజించే గొప్ప సంస్కృతికి నెలవు తెలంగాణ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తీరొక్క పూలతో రూపొందించే ఘనమైన బతుకమ్మతో ఆడిపాడే సంబురాల్లో ఆఖరి రోజైన సద్దుల బతుకమ్మను పురస్కరించుకు ని అక్కా చెల్లెళ్లందరికీ సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సద్దుల బతుకమ్మ సందర్భంగా ట్యాంక్‌బండ్‌తో పాటు రాష్ట్రంలోని చెరువులన్నిం టి వద్ద ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్,  రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సైతం రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ ఆత్మగౌరవా నికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక కొనియాడారు. స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మకు విశిష్ట స్థానం ఉందని తెలిపారు.