31-03-2025 12:01:39 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు
తలకొండపల్లి,మార్చి 30(విజయక్రాంతి):మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం అని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.ముస్లీంల పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్ ను పురస్కరించుకొని అతి పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెం పొందించి మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆ కాంక్షిస్తూ ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాం క్షలు తెలిపారు.నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే రంజాన్ పండుగను ముస్లీం సోదరులు తమ కుటుంబ సభ్యులు,బందు మిత్రులతో సంతోషంగా జరుపుకొవాలని కోరారు.ఉపవాస దీక్షలతో క్రమశిక్షణ,అధ్యాత్మిక చింతన,దాతృత్వం,ప్రేమ,దయ,సోదర భావం,ఐక్యతను పెంపొంది స్తాయని ఎమ్మెల్యే నారాయణరెడ్డి పేర్కొన్నారు.