- 4.5 లక్షలకు దులియా జాతి గేదె కొనుగోలు
- వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన 1000 పశువులు
రాజేంద్రనగర్, జనవరి 24 : నార్సింగి వ్యవసాయ మార్కెట్లో పశు సంక్రాంతి జాతర సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నుంచి సుమారు ఈ పశువులు వచ్చాయి. ఉదయం నుంచి పశువుల క్రయవిక్రయాలు సాయంత్రం వరకు ఉత్సాహంగా జరిగాయి. ఈ పశువుల సంతలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దులియా జాతి గేదె ఏకంగా నాలుగు లక్షల 50 వేల రూపాయలు పలికింది.
శేర్లింగంపల్లి మండలం నల్లగండ్ల గ్రామానికి చెందిన వెంకటరెడ్డి దీనిని కొనుగోలు చేశాడు. ఈ సందర్భంగా వెంకటరెడ్డికి నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కోట వేణు గౌడ్ రసీదు కొనుగోలు పత్రాన్ని అందజేశారు, ఈ పశు సంక్రాంతి జాతరలో నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ దశరథ్, డైరెక్టర్లు, పలువురు నాయకులు కొనుగోలుదారులు పాల్గొన్నారు.