calender_icon.png 7 November, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ చార్జీలు పెంచకపోవడంపై హర్షం

07-11-2024 02:00:06 AM

డిప్యూటీ సీఎం భట్టికి కృతజ్ఞతలు తెలిపిన ఐరన్, స్టీల్ అసోసియేషన్

హైదరాబాద్, నవంబర్ 6(విజయక్రాంతి): విద్యుత్ చార్జీలు పెంచకపోవడంపై స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు హర్షం వ్యక్తంచేశాయి. అంతరాయం లేకుం డా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం అనేది తమ పరిశ్రమలకు గొప్ప ఊరటగా చెప్పుకొచ్చారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (టీఐఎస్‌ఎంఏ) ప్రతినిధులు ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరించాలని సూచించారు. ఫలితంగా స్థానిక యువ తకు ఉపాధి లభిస్తుందన్నారు. భట్టిని కలిసిన వారిలో టీఐఎస్‌ఎంఏ జాయింట్ ప్రెసి డెంట్ ప్రమోద్ అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ నీరజ్, జాయింట్ సెక్రటరీ సుధాంశు శేఖర్, కోశాధికారి వినోద్ అగర్వాల్ ఉన్నారు.