calender_icon.png 4 January, 2025 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం అమ్మకాలకు హ్యాపీ న్యూఇయర్!

02-01-2025 01:50:00 AM

  1. రూ. 200 కోట్లు పెరుగుదల
  2. డిసెంబర్‌లో రెచ్చిపోయిన మందుబాబులు
  3. 45 లక్షల కేసుల బీర్లు తాగేశారు
  4. ఒక్క నెలలో ప్రభుత్వానికి రూ.3805కోట్లు ఆదాయం

హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో మందుబాబులు డిసెంబర్ నెలలో కిక్కుతో ఊగిపో యారు. బీర్లు కేసులకు కేసులు తాగేశారు. కొత్త సంవత్సరం పుణ్యామా అని డిసెంబర్ నెలలో లిక్కర్ అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయి. ఒక్క నెలలోనే 45.9 లక్షల కేసుల బీర్లు, 38.7 లక్షల కేసుల లిక్కర్‌ను రాష్ట్రంలో మద్యం ప్రియులు తాగేశారు.

ఫలితంగా ప్రభుత్వానికి రూ.3,805కోట్ల ఆదాయం వచ్చింది. అమ్మకాల్లో దాదాపు 40శాతానికి పైబడి డిసెంబర్ చివరివారంలోనే జరగడం గమనార్హం. గత నెల 23వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు రూ.1,700కోట్ల విలువ చేసే మద్యం అమ్ముడుపోయింది. గతేడాది చివరివారం రోజుల్లో రూ.1510 కోట్ల మద్యం మాత్రమే అమ్ముడైనట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపా యి. అంటే గతేడాది కంటే ఈసారి దాదాపు రూ.200 కోట్ల మద్యం ఎక్కువ అమ్ముడైంది.

కిక్కిచ్చిన 30వ తేదీ.. 

డిసెంబర్ 30వ తేదీన మద్య అమ్మకా లు భారీగా జరిగాయి. ఆ ఒక్క రోజే రూ.402 మద్యం అమ్మడైందంటే, మందుబాబులు ఏ స్థాయిలో రెచ్చిపోయారో అర్థం చేసువచ్చు. చివరివారం రోజుల్లో రూ.1700 కోట్ల ఆదాయంలో.. 30వ తేదీ న ఒక్కరోజే దాదాపు 23శాతం రావడం గమనార్హం. 23వ తేదీన రూ.193కోట్లు, 24వ తేదీన రూ.197 కోట్లు, 26వ తేదీన రూ.192 కోట్లు, 27వ తేదీన 187 కోట్లు, 28వ తేదీన రూ.191 కోట్లు, 30వ తేదీన రూ.402 కోట్లు, 31వ తేదీన రూ.282 కోట్ల మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.