ప్రజలంతా 2024కు వీడ్కోలు పలికి.. 2025కు స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే సినీ తారలు సైతం తమ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు.
చిరంజీవి: 2025లో కొత్త ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలి. లక్ష్యాలను చేరుకునే ఎనర్జీని 2025 అందించాలి. భారతీయ సినీ వైభవం మరింత విస్తరించడమే కాకుండా ప్రకాశవంతమవ్వాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ప్రేమతో కలిసి మెలిసి సంతోషంగా ఉండండి.
ఎన్టీఆర్: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఈ ఏడాది మరింత ఆనందాన్ని, విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా.
అల్లు అర్జున్: ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా అభిమానులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఐ లవ్ యూ ఆల్.
ధనుష్: నూతన సంవత్సర శుభాకాంక్షలు. సామరస్యం, శాంతితో ముందుకు సాగుదాం.
సాయి ధరమ్: హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఏడాది విజయం, సంతోషం, మంచి ఆరోగ్యం మీకు, మీరు ఇష్టపడేవారికి లభించాలి.
శివకార్తికేయన్: ఈ ఏడాది సంతోషం, విజయంతో నిండిపోవాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు