మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి నుండే యువకులు చిన్నారులు పెద్దలు ఆనంద సాధనాలతో నూతన సంవత్సరం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డులలో గ్రామాల్లోని ముఖ్య కూడళ్ళలో యువకులు చిన్నారులు కేకులు కట్ చేసి నృత్యాలు చేస్తూ ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతు నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో, మండలంలోని గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్ పటిష్ట బందోబస్తు నిర్వహించారు. పట్టణంలో గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా చేపట్టారు. ముఖ్యంగా యువకులు మద్యం మత్తులో వాహనాలు నడపకుండా ఉండేందుకు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు.
పొన్నారంలో...
మండలంలోని పున్నారం గ్రామపంచాయతీలో నూతన సంవత్సర వేడుకలను ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఈధ లింగయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేకులు కట్ చేసి ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం యువకులు చిన్నారులు నృత్యాలు చేస్తూ కేరింతలతో నూతన నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సంకె శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్, నల్లెల్లి సత్యనారాయణ, మాసు నల్లయ్యలు పాల్గొన్నారు.