calender_icon.png 28 February, 2025 | 10:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2025 05:48:07 PM

చేగుంట (విజయక్రాంతి): నోబెల్ బహుమతి అందుకున్న సర్ సివి రామన్, దినోత్సవం సందర్భంగా మండలంలో ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సైన్స్ డే నిర్వహించారు. చందాయిపేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లను ప్రధానోపాధ్యాయులు శ్రీ కిషన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ... నేటి బాలలలో ఎంతో విజ్ఞానం దాగి ఉందని వీరే రేపు కాబోయే శాస్త్రవేత్తలని ఇప్పుడు ప్రతిదీ ఇది ఎలా వచ్చింది? ఏ విధంగా పనిచేస్తుంది అనేటువంటి ఆలోచనలతో జీవించేటటువంటి వారు రేపు కాబోయే శాస్త్రవేత్తలు అని అన్నారు, విద్యార్థులు  తరగతి గదిలో చదువుకున్నటువంటి పుస్తకాలు విషయాలను నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగించాలో విద్యార్థుల నేర్చుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు 280 సైన్స్ ఎగ్జిబిట్లను పాఠశాలలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దామోదర్, సౌజన్య, నర్సిములు, విఠల్ రెడ్డి, సిద్దిరాములు, స్వప్న, సలీం, శ్రీనివాస్, బంగారయ్యా, వీణ, రాములు, గిరిధర్, అజిత తదితరులు పాల్గొన్నారు.