28-02-2025 05:45:33 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నేషనల్ సైన్స్ డే సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వివిధ రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసి ప్రదర్శించారు. భవిష్యత్ తరాలకు సైన్స్ యొక్క ప్రాముఖ్యత తెలివాల్సిన అవసరం ఉందని పలు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సైన్స్ డే సందర్భంగా టీచర్లకు సన్మానం చేశారు.