నడిగూడెం (విజయక్రాంతి): మండల పరిధిలోని నారాయణపురం, సిరిపురం గ్రామాలలో సోమవారం సిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ప్రకృతి రైతులు నాగిరెడ్డి వెంకటరెడ్డి కవిత, వాసికర్ల శేషుకుమార్ లక్ష్మిప్రియ దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతులు వీరా రెడ్డి, సైదులు, బుచ్చిరాములు, రాములు, వెంకయ్య సిరి ఫౌండేషన్ వ్యవస్థాపకులు మొలుగూరి గోపయ్య పాల్గొన్నారు.