హుజూర్ నగర్: స్థానిక ప్రియదర్శిని విద్యాసంస్థల్లో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరపడం జరిగింది. భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జక్కుల రమేష్ మాట్లాడుతూ.. "మౌలానా అబుల కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రిగా విలక్షణమైన విద్యా ప్రణాళికలను అమలు చేశారు కాబట్టి విద్య ద్వారా ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య మాత్రమే" అని అబుల్ కలాం జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థినీ విద్యార్థులను విద్యలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ శిరీష, లక్ష్మణ్ రాజు, అమూల్య విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.