కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): శ్రీ భక్త మార్కండేయ జయంతి వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అటవీ శాఖ చెక్ పోస్ట్ సమీపంలోని మార్కండేయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. పలువురు దంపతులు హోమం నిర్వహించారు. ఆలయం నుండి పట్టణ ప్రధాన వీధుల గుండా శోభయాత్ర చేపట్టారు. సందర్భంగా మహిళలు కోలాటం ఆడారు. ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన భక్తులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా చేపట్టిన శోభాయాత్రతో జిల్లా కేంద్రంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా మార్కండేజాతి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు అనుమాండ్ల శ్రీకాంత్ సంఘం నాయకులు లింగయ్య, శ్రీకాంత్, మోహన్, అజయ్, ధర్మయ్య, మధుకర్, భద్రయ్య, మహేష్, ప్రకాష్, సునీత, రేణుక, జయ, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.