calender_icon.png 6 February, 2025 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆనంద జీవనమార్గాలు

08-12-2024 12:00:00 AM

భౌద్ధ మతస్థులు ప్రతి ఏటా నిర్వహించుకునే ప్రధాన ఉత్సవాల్లో ‘బోధి దినోత్సవం’ ఒకటి. ఈ పుణ్య ఘ డియల్లో గౌతమ బుద్ధుడు లేదా యువరాజు సిద్ధార్థ్ గౌతముడు జ్ఞానోదయమైన శుభవేళలుగా ఈ సంబరాలను ఘనంగా  జరుపుకుంటారు. సిద్ధార్థుడు జ్ఞానోద యం పొంది బుద్దుడిగా మారిన రోజు నేడు. సిద్ధార్థుడు ప్రజల జీవితాల్లో ఎదురవుతున్న కష్టా లు, దుఃఖాలు, పీడనలు, అనారోగ్యాలు, బాధలు, దారిద్య్రం, మరణాలను చూసి చలించిపోయాడు.

మా నవ జీవిత పరమార్థాన్ని తెలుసుకోవడానికి రాజ్యకాంక్షను వదిలి బుద్ధగయలో బోధివృక్షం నీడన తపస్సు చేసి, జ్ఞానోదయం పొందాడు. వీటికి సమాధానంగా ‘నిర్వాణ’ స్థితిని, అష్ట ఉత్తమ జీవన సూత్రాల (నోబుల్ ఎయిత్ పోల్ పాత్)ను బుద్ధుడు సూచించాడు. ఫలితంగా ప్రజలు బాధలకు దూరమై మానసిక ప్రశాంతతతో ఎదుగుతూ సంతోష జీవితా లను గడపాలని బోధించారు. 

సుమారు 2,500 ఏండ్ల క్రితం ‘బోధి దినం’ ప్రారంభమైంది. ఆత్మ విమర్శ, ధ్యానం, నూతన తీర్మాణా లు, బోధనల మననం, వాటిని తప్పక పాటించడం వంటి వాటికోసం సంకల్పం తీసుకోవడం లాంటి సత్కార్యాలు ఈ రోజున చేపడతారు. వివేకం, కరుణ, భౌతిక సుఖాలపట్ల నిరాసక్తత లాంటివి మనిషి సుఖజీవనానికి సోపానాలుగా ఉపకరిస్తాయని నమ్ముతారు. ఆధ్యాత్మిక ఆచారాలను పాటించిన మానవ జీవితాల్లో సానుకూల శక్తి ఉద్భవించి, జ్ఞానోదయ స్థితికి చేరుతారని, మరో దుఃఖమయ జీవితం లేకుండా మోక్షం సిద్ధిస్తుందని బుద్ధుడు బోధించాడు. 

అష్టోత్తమ జీవన సూత్రాలు: సన్మార్గ దర్శనం/ ఆలోచనలు (రైట్ వ్యూవ్), సరైన తీర్మానాలు తీసుకోవడం (రైట్ రెజొల్యూషన్స్), సుభా షణ గుణం(రైట్ స్పీచ్), సత్కార్యాలను చేయడం (రైట్ ఆక్షన్), సక్రమ మార్గంలో జీవనోపాధులు పొందడం (రైట్ లైవ్లీవుడ్), సరైన కృషి చేయడం (రైట్ ఎఫర్ట్), మానసిక ఆలోచనలు చక్కగా ఉండడం (రైట్ మైండ్‌ఫుల్‌నెస్), చక్కటి ఏకాగ్రతను పొందడం (రైట్ కాన్సెంట్రేషన్). అందరు ఆనందంగా, ఆరోగ్యంగా, పవిత్ర భావనలతో బాధలకు దూ రంగా జీవించాలని బుద్ధుడు ఆకాంక్షించాడు.

మనిషి కర్మకు కారణం మనసు మాత్రమే. మనం ఏ విధంగా ఆలోచించి ఆచరణలో పెడితే అదే జరుగుతుంది. ఆనందానికి ఆనందంగా ఉండడమే ఓ ఉత్తమ మార్గం. పంచడంతో ఆనందం తరిగి పోదు. ఒక కొవ్వత్తి వేల కొవ్వత్తులను వెలిగించినట్లు ఒక మహోన్నతుడు వేలమందికి జీవనానంద రహస్యాలను బోధించగలడు. మధుపాళీ