08-04-2025 12:09:50 AM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి) మారుతున్న కాలానికి అనుగుణంగ ఆరోగ్య సమస్యలపై అవగాహనతో పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరు ఆరోగ్యకరమైన, ఆనందభరితమైన జీవితాన్ని సాగించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి అన్నారు. సోమవారం స్థానిక బాబు క్యాంప్ గవర్నమెంట్ హైస్కూల్ లో ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవ‘ సందర్భంగ జరిగిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి ముఖ్యఅతిథిగ పాల్గొన్నా రు.
ఈ సందర్భంగ న్యాయమూర్తి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం.. అని ఆరోగ్యానికి మించిన సంపద లేదన్నారు. ఆరోగ్య సమస్యలు లేని జీవితాన్ని గడపాలంటే ఖచ్చితంగా మన జీవనశైలి పద్ధతులను మార్చుకోవడం ద్వారా ఆరోగ్యంగా జీవించగలమన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం ద్వారా శారీరక పనితీరు సక్రమంగా ఉంటుంద న్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా, దృఢంగా ఉంటారన్నారు.
ఒత్తిడిని అధిగమించాలంటే దైనందిన జీవితంలో యోగా తప్పనిసరి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి డిప్యూటీ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ జయలక్ష్మి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమం అనంతరం బాబు క్యాంపు లో ఉన్న భవిత సెంటర్ ను సందర్శించారు అక్కడ పిల్లలకు అందుతున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యుడు లక్కినేని సత్యనారాయణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, డిప్యూటీ డిఇఎంఒ ఫయాజుద్దీన్, పాఠశాల హెడ్మాస్టర్ నీరజ, ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి, చందర్ రావు, సునందిని తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌జెండర్స్‌కు ఉచిత బియ్యం పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ప్రతినెల ట్రాన్స్ జెండర్ లకు ఉచిత బియ్యం పంపిణీ జరుగుతుందని అది సక్రమంగా జరిగేలా సెక్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు మేనేజర్ పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి భానుమతి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు సోమవారం కొత్తగూడెంలో ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ట్రాన్స్ జెండర్, సెక్స్ వర్కర్స్ కు ఉన్న సమస్యలను న్యాయమూర్తి అడిగి తెలు సుకున్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి. నిరంజన్ రావు, సెక్యూరిఎన్జీవో రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.