calender_icon.png 15 January, 2025 | 6:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఏకాదశి శుభాకాంక్షలు

18-07-2024 12:33:58 AM

హైదరాబాద్, జూలై 17 (విజయక్రాంతి): తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగ జరుపుకుంటారని అన్నారు. అదే సందర్భంలో త్యాగానికి గుర్తుగా హిందూ ముస్లిం లు ఐక్యంగా పీర్ల పండుగగా గురువారం జరుపుకుంటున్న మొహరం తెలంగాణ మిళిత సంస్కృతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రజ లు సుఖ సంతోషాలతో  ఆయురారోగ్యాలతో జీవించాలని ఈ సంద ర్భంగా ప్రార్థించారు. ఆషాడ మా సంలో వచ్చే శుద్ధ ఏకాదశికి అత్యం త విశిష్టత ఉందన్నారు. ఏడాది ప్రారంభానికి సూచికగా తొలి ఏకాదశిని అభివర్ణించేవారని పురాణాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. మహావిష్ణువు ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉండటంతో తొలి ఏకాదశిని శైవ ఏకాదశి అని కూడా అంటారని తెలిపారు. ఈ ఏకాదశి విష్ణువుకు ఎంతో పవిత్రమైందని, 24 ఏకాదశుల్లో ఉపవాసం  చేయలేక పోయినవారు ఒక్క తొలి ఏకాదశి రోజు దీక్ష చేస్తే కోటి పుణ్యాలకు సాటి అని పండితులు చెబున్నారు.