ఈ జనరేషన్ సీనియర్ సిటిజన్స్ ఇంటికే పరిమితం కాకుండా యూత్‌తో పోటీపడుతూ అన్నింట్లోనూ దూసుకుపోతున్నారు. అయితే అన్నీ ఉన్నా ఒంటరితనంతో బాధపడుతున్నారు. అయితే 60 ఏళ్ల వయసులో ఎలా ఆనందంగా జీవించాలి? అందుకోసం ఏం చేయాలి? ఆరోగ్యమంత్రం ఏంటి? అనే విషయాలపై డాక్టర్ వాడా అధ్యయనం చేశారు. జపనీస్ పుస్తకంలో సీనియర్ సిటిజన్స్‌కు సంబంధించిన అనేక విషయాలను రాసుకొచ్చారు. ఈ సందర్భంగా ‘వృద్ధులు కాదు అదృష్టవంతులు’ అంటూ ప్రస్తావించారాయన.
60 ఏళ్లు పైబడినవాళ్లకు శారీరక పరీక్షలు అవసరం అంటాడు డాక్టర్ వాడా. అయితే ‘ఆరోగ్య ప్రమాణం’ అనేది ఒక్కో వ్యక్తికి ఒక్కోవిధంగా ఉంటుందని, డాక్టర్లు చెప్పే మాటలు నమ్మొద్దని అన్నారాయన. అలాగే అవసరమైనప్పుడు మాత్రమే మందులు వేసుకోవాలి అని కూడా సూచనలు చేశారు. చాలామంది నిద్రలేమితో సమస్యను గుర్తించిన డాక్టర్ వాడా తరచూ నిద్రమాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదని, వయసు పెరిగేకొద్దీ నిద్ర సమయం కోల్పోవడం సహజమేనని, నిద్రలేమితో ఎవరూ చనిపోవడం లేదని అన్నారు.
‘ఎప్పుడు కావాలంటే అప్పుడు నిద్రపోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మేల్కొండి’ అంటూ కూడా అద్భుతమైన విషయాలను ప్రస్తావించారు. ఆ ఆరోగ్య రహస్యం మీకోసం అందిస్తున్నాం. అవేంటో తెలుసుకోండి.
1. ప్రతిదీ ప్రశాంతంగా
* మీకు కావలసినది తినండి. కానీ నియంత్రణలో ఉండండి.
* ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.
* మీకు నచ్చని వ్యక్తులతో అమర్యాదగా ప్రవర్తించవద్దు.
* మీకు ఇష్టమైనవాళ్లను జాగ్రత్తగా చూసుకోండి.
* వ్యాధితో చివరివరకు పోరాడటం కంటే దానితో జీవించడం మంచిది.
* జీవితం పట్ల ఎల్లప్పుడు ఆశవాదంతో ఉండాలి.
* ఆహారం తిన్న తర్వాత తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు తాగాలి.
* నిద్రపోలేనప్పుడు మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.
* సంతోషకరమైన పనులు చేయడం రోజంతా హాయిగా ఉండొచ్చు.
* ఉద్దేశపూర్వకంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.
ఆనందంగా.. ఆరోగ్యంగా
* అప్పుడప్పుడు ‘ఫ్యామిలీ డాక్టర్ ను కలుస్తూ ఉండండి.
* ఓపికగా ఉండండి. ఉద్వేగాన్ని పక్కన పెట్టండి.
* కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అని అంటారు.
* అత్యాశతో ఉండకండి. అది ఎప్పడూ మంచిదికాదు.
* ఎప్పుడూ మంచానికే పరిమితం కాకుండా అప్పుడప్పుడు అడుగులు వేయండి.
* సమస్యాత్మకమైన విషయాల గురించి చింతించకండి.
* స్నానం చేసిన తర్వాత, బట్టలు మార్చుకునేటప్పుడు ఇతరుల సాయం తీసుకోండి.
* మీరు చేసే పనులు ఇతరులకు ప్రయోజనకరంగా ఉండాలి.
* ప్రతిరోజు మీదే అంటూ ప్రశాంతంగా జీవించండి.
* కోరికలే దీర్ఘాయువుకు మూలం.
3. మీ జీవితం మీ చేతుల్లోనే
* ఎప్పుడూ ఒకే దగ్గర ఉండకుండా కదులుతూ ఉండండి.
* చిరాకుగా అనిపించినప్పుడు లోతైన శ్వాస తీసుకోండి.
* వ్యాయామం చేయండి,తద్వారా శరీరం దృఢంగా మారుతుంది.
* వేసవిలో ఎక్కువ నీరు తాగుతూ ఉండాలి.
* ఏదైనా ఆహారం మింగకుండా నమిలితే.. శరీరం, మెదడు మరింత శక్తివంతంగా మారుతుంది.
* ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుంది. వయసు వల్ల కాదు అనే విషయం గుర్తించుకోవాలి.
* ఏదైనా రోగంతో బాధపడితే ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.
* మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.
* ప్రతి రోజూ ఆరుబయట అడుగులే వేయండి.
* సొసైటీతో కనెక్ట్ అయి ఉండండి.