calender_icon.png 15 March, 2025 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథాశ్రమంలో ఆనంద హోలీ

15-03-2025 12:43:22 AM

జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు

మహబూబ్ నగర్ మార్చి 14 (విజయ క్రాంతి) : జిల్లావ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న పెద్ద బేధం లేకుండా అందరూ కలిసి పోయి సంతోషమైన వాతావరణంలో హోలీ రంగుల మయంలో సంబరాలు చేసుకున్నారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏనుగొండ లో నిర్వహిస్తున్న సన్నిధి ఆశ్రమం లో శుక్రవారం హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

సన్నిధి సిబ్బంది, విద్యార్థులు  హోలీ వేడుకల్లో  ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరికొకరు రంగులు చల్లుకొని మిఠాయిలు పంపిణీ చేసుకొని  పరస్పరం  హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు కేరింతలు కొడుతూ ఆనందోత్సహల మధ్య  పెద్ద ఎత్తున నృత్యాలు చేశారు.

ఈ సందర్భంగా లయన్ నటరాజ్ మాట్లాడుతూ హోలీ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ లయన్ నటరాజ్, మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ ఎ. శ్రీహరి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్, తెలంగాణ జూనియర్ డాక్టర్స్  అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధి నవదీప్, లయన్ శ్రీహరి తదితరులు ఉన్నారు.