calender_icon.png 27 December, 2024 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్ డే టూ యూ..

08-11-2024 12:06:46 AM

పట్టువస్త్రంపై సీఎం చిత్రం

సిరిసిల్ల, విజయక్రాంతి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రాన్ని పట్టువస్త్రంపై నేసి తన అభిమానాన్ని చాటుకున్నారు సిరిసిల్ల పట్టణా నికి చెందిన వెల్ది హరిప్రసాద్. ఈ నేతన్న ఐదు రోజులు శ్రమించి దీనిని తయారు చేశాడు. ఇటీవల చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత సదస్సులో పాల్గొన్న హరిప్రసాద్, బుల్లి చేనేత మగ్గంపై రేవంత్‌రెడ్డి చిత్రం వచ్చేలా తయారుచేసి సీఎంకు అందించారు.

పొలం నవ్వింది..

కరీంనగర్, విజయక్రాంతి: శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పచ్చునూరు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో సీఎం ముఖచిత్రాన్ని తీర్చిదిద్దారు. రెండు నెలలుగా వ్యవసాయ క్షేత్రంలో సీఎం ముఖచిత్రం వచ్చేలా సాగుచేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ ఫొటోను సీఎం రేవంత్ రెడ్డికి కవ్వంపల్లి బహూకరించారు.          

పూరి బీచ్‌లో సీఎం సైకతశిల్పం 

 హైదరాబాద్, విజయక్రాంతి : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్‌లో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ సీఎం సైకత శిల్పాన్ని వేయించారు. సీఎంకు బర్త్‌డే కానుకను అందజేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉంటూ దిగువస్థాయి శ్రేణులను కూడా కలుపుకొని, పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పనిచేశారని కొనియాడారు.