calender_icon.png 15 January, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కేంద్ర మంత్రి బండి జన్మదినోత్సవం

12-07-2024 12:27:39 AM

కరీంనగర్/ రాజన్న సిరిసిల్ల, జూలై 11 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్‌లోని టవర్‌సర్కిల్ ప్రాంతంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్ ఆధ్వర్యంలో అల్పాహారం వితరణ చేశారు. తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్‌లోని మానసిక వికలాంగుల పాఠశాలలో  బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. తిమ్మాపూర్ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, జిల్లా అధికార ప్రతినిధి కల్యాణ్‌చం ద్ర, జిల్లా ఈసీ మెంబర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్నసిరిసిల్ల భాజపా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు.