calender_icon.png 6 January, 2025 | 5:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్ డే .. టు తమన్నా

21-12-2024 12:00:00 AM

హీరోయిన్ తమన్నా జన్మదినం ఈ రోజు. 1989, డిసెంబర్ 21న ముంబై లో పుట్టిన ఈ మిల్కీ బ్యూటీ నేటితో 35వ పడిలోకి అడుగిడుతోంది. తల్లిదండ్రులు సంతోష్, రజనీ భాటియా కాగా, ఈమె అన్నయ్య పేరు ఆనంద్ భాటియా. ముంబైలోని మేనకాజీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్టు స్కూల్‌లో తమన్నా పాఠశాల విద్య పూర్తిచేసింది. ఏడాది పాటు పృథ్వీ థియేటర్‌లో శిక్షణ తీసుకుంది. 2005లో హిందీ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో నట జీవితాన్ని ప్రారంభించిన ఈమె తెలుగు చిత్రసీమకు ‘శ్రీ’ చిత్రంతో పరిచయమైంది.

ఈ ఏడాది విడుదలైన తమిళ కామెడీ హారర్ చిత్రం ‘అరణ్మనై’ నటిగా ప్రశంసలు అందుకుంది. హిందీలో ‘స్త్రీ2’, ‘వేద’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం ‘సికందర్ కా ముకద్దర్’, ‘డయరింగ్ పార్టనర్స్’తో పాటు తెలుగులో ‘ఓదెల2’ సినిమాల్లో నటిస్తోంది.