కూకట్ పల్లి (విజయక్రాంతి): ఆల్విన్ కాలనీ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు స్థానిక నాయకులు, కార్యకర్తలు, పలు కాలనీల అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యల హాజరై శాలువాతో సహకరించారు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, అనిల్ రెడ్డి, సమ్మారెడ్డి, పోశెట్టి గౌడ్, శివరాజ్ గౌడ్ తదితరులు ఉన్నారు.