19-03-2025 12:00:00 AM
మంచు మోహన్‌బాబు.. ఆయన అసలు పేరు భక్తవత్సలం నాయుడు. 1946, మార్చి 19న జన్మించారు. 500లకు పైగా చిత్రాల్లో ప్రధాన, సహాయ పాత్రల్లో నటించారు. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ డైలాగ్ కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించారు. నిర్మాతగానూ సినీరంగంలో గుర్తింపు పొందారు.1975లో దాసరి నారాయ ణరావు దర్శకత్వంలో రూపొందిన ‘స్వర్గం చిత్రంలో విలన్‌గా నటించడం ద్వారా నటుడిగా తొలి పెద్ద విజయాన్ని అందుకున్నారు మోహన్‌బాబు. ఎన్టీఆర్‌ను అభిమానించే మోహన్‌బాబు ఆయనతో ‘మేజర్ చంద్రకాంత్’ వంటి ప్రేక్షకాదరణ పొందిన చిత్రంలో స్క్రీన్ పంచుకున్నారు.
అవసరాల శ్రీనివాస్.. మార్చి 19న జన్మించారు. సినీ పరిశ్రమలో స్క్రీన్ రైటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా రాణిస్తున్న ఈయన రెండు నంది అవార్డులు దక్కించుకున్నారు. అష్టాచెమ్మా, పిల్ల జమీందార్, అడ్డా, గోవిందుడు అందరివాడేలే, ఊహలు గుసగుసలాడే, ఎవడే సుబ్రహ్మణ్యం, నాన్నకు ప్రేమతో, మహానటి, ఎన్టీఆర్: కథానాయకుడు, కల్కి 2898 ఏడీ చిత్రాల్లో నటించారు. ఇటీవల ‘సంక్రాంతికి వస్తున్నాం’లో ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. గోల్కొండ హైస్కూల్, ఊహలు గుసగుసలాడే, జ్యోఅచ్యుతానంద, నూటొక్క జిల్లాల అందగాడు వంటి సినిమాలకు రచయితగానూ పనిచేశారు.