calender_icon.png 20 April, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

18-03-2025 12:00:00 AM

అనుమోలు సుశాంత్.. 1986, మార్చి 18న తండ్రి అనుమోలు సత్యభూషణరావు, తల్లి అక్కినేని నాగసుశీల దంపతులకు జన్మించారు. అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడిగా సినిమా ఇండస్ట్రీకి సుపరిచితుడైన సుశాంత్ 2008లో కాళిదాసు చిత్రం ద్వారా సినీరంగంలో అడుగు పెట్టారు.

2009లో ‘కరెంట్’తో అలరించిన సుశాంత్ హీరోగా నటించిన మూడో చిత్రం ‘అడ్డా’ అంచనాలను అందుకోలేకపోయింది. ‘దొంగాట’, ‘ఆటాడుకుందాం రా’, ‘చి.ల.సౌ’, ‘అల వైకుంఠ పురంలో’, ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘రావణాసుర’ వంటి సినిమాల్లోనూ సుశాంత్ నటించారు. అయితే సుశాంత్ చివరిసారి 2023లో చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘భోళా శంకర్’ చిత్రంలో కనిపించారు.