06-03-2025 12:00:00 AM
శర్వానంద్ బర్త్‌డే ఈరోజు. ఆయన 1984, మార్చి 6న జన్మించారు. గురువారం 41వ పడిలోకి అడుగుపెడుతున్న శర్వాకు పాఠశాల రోజుల నుంచే కళలపై మక్కువ ఎక్కువ. అందుకే నాటికలు, నృత్య పోటీల జాబితాలో ఇతని పేరే ముందుండేది. పరీక్షల ఫలితాల జాబితాలో మాత్రం చివరి స్థానం ఈయదేనట. సినిమాల్లోకి రావాలన్న తన కలను నిజం చేసుకునేందుకు ఎన్నో డక్కామొక్కీలు తిన్నాడు.
తొలిసారి ‘ఐదో తారీఖు’ సినిమాలో హీరోగా నటించి, ‘గౌరీ’ చిత్రంలో హీరో స్నేహితుడి క్యారెక్టర్ చేశాడు. ‘యువసేన’లో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించి హిట్ట్ అందుకున్నాడు. అలా హీరోగా మారిన శర్వా నటించిన సినిమాల్లో ‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, ‘శతమానం భవతి’ చెప్పుకోదగ్గవి. శర్వా చివరిసారి ‘మనమే’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించారు.