calender_icon.png 5 February, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హ్యాపీ బర్త్డే

05-02-2025 12:00:00 AM

అభిషేక్ బచ్చన్ బర్త్ డే బుధవారమే. 1976, ఫిబ్రవరి 5వ తేదీన జన్మించిన ఆయన నేడు 49వ పడిలో అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ బాద్ షా అమితాబ్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అభిషేక్ నటుడిగా, నిర్మాతగా, నేపథ్య గాయకుడిగా రాణించారు.

2000 సంవత్సరంలో జేపీ దత్తా దర్శకత్వంలో వచ్చిన ‘రెఫ్యూజీ’ సినిమాతో కథానాయకుడిగా అరంగేట్రం చేసి, తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2004లో అభిషేక్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ధూమ్’ ఆయనకు హిందీ సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది.

‘బంటీ ఔర్ బబ్లీ’లో అభిషేక్ తన తండ్రి అమితాబ్‌తో స్క్రీన్ పంచుకున్నారు. ఇందులో నటనకు గాను అభిషేక్‌ను ఫిలింఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్ ప్రొడ్యూసర్ పురస్కారాలు కూడా అభిషేక్ ఖాతాలో ఉన్నాయి.